ప్రజలకు జాగ్రత్తలు చెప్పిన చిరంజీవి
NEWS Sep 01,2024 06:42 am
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల ప్రభావం ఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. ‘మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ ఉంటారని ఆశిస్తున్నాను’ అని చిరు ట్వీట్ చేశారు.