ఫుడ్ పాయిజన్ జరిగి అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని TNTUC అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎం స్వామి వైద్యులకు సూచించారు. అరకు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిలకు ఆయన పరామర్శించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.