జాముగుడ పాఠశాలలో వసతులు కరువు
NEWS Sep 01,2024 08:59 am
జాముగుడ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో కనీస వసతులు కొరవడ్డాయి. సురక్షితమైన తాగునీరు అందించడానికి ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటు ఏడాది క్రితం మరమ్మతులకు గురైనా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. దీంతో తాగడానికి, వాడుకకు బోరు నుంచి వచ్చే నీటినే విద్యార్థినులు తాగుతున్నారు. అసౌకర్యాల వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని, హెచ్ఎం, వార్డెన్ పట్టించుకోవడం లేదని విద్యార్థినులు వాపోతున్నారు.