అంజన్నను దర్శించుకున్న వైస్ చాన్సలర్
NEWS Sep 01,2024 08:57 am
కొండగట్టు అంజన్నను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టీ.కిషన్ రావు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి, స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రామకృష్ణారావు, సహాయ కార్యనిర్వాహణాధికారి అంజయ్య, ఆలయ పర్యవేక్షకులు హరిహర నాథ్, ఆలయ స్థానాచార్యులు కపిందర్ ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.