చంద్రబాబు తొలిసారి సీఎం @ 30 ఏళ్లు
NEWS Sep 01,2024 04:23 am
AP: సీఎం చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి నేటికి (సెప్టెంబర్ 1) 30 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సంబరాలు నిర్వహించుకుంటున్నారు టీడీపీ శ్రేణులు. చంద్రబాబు వంటి రాజకీయ నేత ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టమని, ఆయన దూరదృష్టికి ఎవరూ సాటి రాలేరని, నేటి తరాలకు ఆదర్శనీయుడు అని టీడీపీ నేతలు కొనియాడారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు.