AP భారీ నుంచి అతి భారీ వర్షాలు
NEWS Sep 01,2024 04:11 am
AP: ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. విజయవాడలో మళ్లీ భారీ వర్షం మొదలైంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు అధికారులతో రివ్యూ నిర్వహించారు. టెలి కాన్ఫరెన్స్‌లో పలు సూచనలు చేశారు.