తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్
NEWS Sep 01,2024 04:02 am
తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 17 జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని, కొమరం భీమ్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తుందని అంచనా వేసింది. మిగతా జిల్లాలకు మోస్తరు వర్ష సూచన చేసింది.