భారీ వర్షాలు - అప్రమత్తంగా ఉండాలి
NEWS Sep 01,2024 05:03 am
కరీంనగర్ : రానున్న రెండు రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన దృష్ట్యా, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. రాగాల 48 గంటలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళవద్దని సూచించారు.