వెనిగండ్ల రాముకు అభినందన సభ
NEWS Aug 31,2024 06:47 pm
న్యూజెర్సీ: ఒకప్పటి ఎన్నారై వెనిగండ్ల రాము గుడివాడలో ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారిగా అమెరికా పర్యటనలో భాగంగా పలు రాష్ట్రాల్లోని ఎన్నారైలు ఆయనకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సత్కరిస్తున్నారు. తాజాగా న్యూజెర్సీలో కూటమి ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. రాము వెనిగళ్ళ మాట్లాడుతూ.. ఎన్నారైల ఆత్మీయ సత్కారం మరచి పోలేనిదన్నారు. జన్మభూమి ప్రగతికి తోడ్పాటును అందిస్తున్న ఎన్నారైల సేవలు మరువలేనివంటూ, తన గెలుపులో ఎన్నారైలు కీలక పాత్ర పోషించారన్నారు.