తెలంగాణలో స్తంభించిన జనజీవనం
NEWS Aug 31,2024 05:51 pm
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. ఉత్తర జిల్లాల్లో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్నిజిల్లాల్లో వాగుల ఉధృతికి గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జనజీవనం స్థంభించిపోయింది. మరోవైపు తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలకు ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతుంది.