బాలయ్య వేడుకలకు అందరికి ఆహ్వానం
NEWS Aug 31,2024 05:34 pm
బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ నోవాటెల్‌లో జరిగే ఈ వేడుకలకు కొందరికి ఆహ్వానాలు అందలేదన్న వార్తలపై తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి సమావేశమై క్లారిటీ ఇచ్చింది. ఈ వేడుకల్లో కళాకారులు, టెక్నీషియన్స్, దర్శకనిర్మాతలు అందరూ పాల్గొంటారని, సంఘాల ద్వారా ఆహ్వానాలు పంపినట్లు వెల్లడించారు. ఎవరికైనా ఆహ్వానం అందకపోతే.. చిత్ర పరిశ్రమను తమ కుటుంబంలా భావించి అందరూ రావాలని కోరారు.