రంపచోడవరంలో కంట్రోల్ రూం ఏర్పాటు
NEWS Aug 31,2024 05:35 pm
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ప్రాజెక్టు ఆఫీసర్ కట్టా సింహాచలం తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున వాగులు, కొండ కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో వాటిని దాటవద్దని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. తక్షణ సహాయం కోసం కంట్రోల్ రూం నంబర్ 93977 59019 కు ఫోన్ చేయాలని తెలిపారు.