పట్టణంలో ఆటో డ్రైవర్లు అందరూ కచ్చితంగా యూనిఫామ్ ధరించాలని తుని పట్టణ సిఐ గీతా రామకృష్ణ ఆదేశించారు. తుని మెయిన్ రోడ్ లో ఆయన ఆటోలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో కాలేజీ విద్యార్థినులను తీసుకెళ్తున్న ఒక డ్రైవర్ షార్ట్ ధరించి ఆటో నడపడంపై హెచ్చరించారు. పలు వాహనదారులకు ఫైన్ లు విధించారు. డ్రైవర్లు యూనిఫామ్ ధరించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.