ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద తాకిడి ఎక్కువ అవ్వడంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయినిటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 698.550 అడుగుల వద్ద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో గా 13318 క్యూసెక్కుల నీరు చేరుతున్న క్రమంలో ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి 27296 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.