ఈలప్రోలు దగ్గర బుడమేరు కట్ట తెగే ప్రమాదం ఉన్నట్లు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బుడమేరు కాలువపై కట్ట తెగితే, దిగువ ప్రాంతంలో ఉన్న గ్రామాలు నీటమునిగి ప్రమాదం ఉంది. ప్రాణాలకు తెగించి స్థానిక రైతులందరూ ఆపటానికి ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి బుడమేరుకి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.