సెప్టెంబర్ 2న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అమలాపురంలో జనసేన నాయకులు నల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో మల్టీ స్పెషాలిటీ ఉచిత మెగా వైద్య శిబిరంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. రోగులకు మందులు పంపిణీ చేశారు.