వైరల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
NEWS Aug 31,2024 02:36 pm
వైరల్ వ్యాధులపై అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రభలుతున్న వ్యాధుల పట్ల తగిన చర్యలు తీసుకునేందుకు ఆరోగ్య, పంచాయతీ, తాగునీటి సరఫరా, డ్రైనేజీ తదితర అధికారులతో సత్యానందరావు శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య విషయంలో వెనకాడేది లేదని, ఫీవర్ సర్వే నిర్వహించాలని అన్నారు.