బాసర అమ్మవారిని దర్శించుకున్న ఔరంగాబాద్ న్యాయమూర్తులు
NEWS Aug 31,2024 02:35 pm
బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని శనివారం ముంబై ఉన్నత న్యాయస్థానం, ఔరంగాబాద్ బ్రాంచ్ న్యాయమూర్తులు నితిన్, సూర్యవంశి, శైలేష్, బ్రహ్మేష్ లు దర్శించుకున్నారు. వారికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీర్థప్రసాదాలు అందించారు.ఈ కార్యక్రమంలో వారి వెంట ఆలయ ఈవో విజయ రామారావు ఉన్నారు.