పోలీసుల అనుమతి తప్పక తీసుకోవాలి: ఎస్పీ
NEWS Aug 31,2024 02:35 pm
గణేష్ మండపాల నిర్వాహకులు నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, గణేష్ మండపాల కొరకు పోలీసుల అనుమతికై దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్వాహకులు ఏర్పాటు చేసే గణేష్ ప్రతిమ ఎత్తు, ఏర్పాటు చేస్తున్న ప్రదేశం, తదితర సమాచారాన్ని పోలీస్ శాఖ నిర్వహిస్తున్న వెబ్సైట్లో పొందుపరిచాలని సూచించారు.