మండపాలకు అనుమతులు తప్పనిసరి
NEWS Aug 31,2024 05:37 pm
ఆరకు సర్కిల్ పరిధిలో వినాయక మండపాలలో విగ్రహాలు ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి అని CI హిమగిరి తెలిపారు. ఉత్సవాలను నిర్వాహకులు, అధికారులు, ప్రజలతో కలిసి ఆనందంగా జరుపుకోవాలన్నారు. సింగిల్ విండో సిస్టమ్, ganeshutsav.net సైట్ ద్వారా విగ్రహాలు ఏర్పాటుకు అనుమతి పొందలన్నారు. మండపం వద్ద టపాకాయలు కానీ, అగ్నికి కారణమగు వస్తువులు ఉండరాదన్నారు. లౌడ్ స్పీకర్లను రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు వినియోగించరాదన్నారు