హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కైవాక్ వే
NEWS Aug 31,2024 01:34 pm
TG: హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కైవాక్ వే ఏర్పాటుకు ప్లాన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో ఇంటర్నేషనల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని, బ్యాక్ వాటర్ వరకు బోటింగ్‌ను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. వీటితో పాటు ఫణిగిరి, నేలకొండపల్లి టూరిజం సర్క్యూట్, హైదరాబాద్-నాగార్జునసాగర్ మధ్య 4 లేన్ల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.