YS జగన్‌కు నోటీసులు ఇవ్వలేదు
NEWS Aug 31,2024 01:29 pm
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా వైసీపీ అధినేత జగన్‌కు నోటీసులు ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, తాము జగన్‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వెల్లడించారు. లోటస్‌పాండ్‌లోని జగన్ ఇంటిని బఫర్ జోన్‌లో నిర్మించారంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.