కొట్టుకుపోయిన కారు ముగ్గురు మృతి
NEWS Aug 31,2024 12:41 pm
గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని ఉప్పలపాడు సమీపంలోని వాగు ఉదృతంగా ప్రవహిస్తున్న సమయంలో ముందుకు వెళ్లాలని ప్రయత్నించిన క్రమంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. నంబూరులోని స్కూల్లో పని చేస్తున్న ఉప్పలపాడుకు చెందిన రాఘవేంద్ర.. అదే పాఠశాలకు వెళ్లిన ఉప్పలపాడుకు చెందిన ఇద్దరు విద్యార్థులు సాత్విక్, మాణిక్ ను తీసుకొని తమ స్వగ్రామానికి బయలుదేరే సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది.