రైతుల ఆందోళనలో వినేశ్ ఫొగాట్
NEWS Aug 31,2024 12:26 pm
ఒలింపియన్ వినేశ్ ఫొగాట్ హరియాణాలోని శంభూ సరిహద్దు వద్ద రైతులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నారు. రైతులకు తన మద్దతు ఉంటుందని తెలిపారు. ఓ విలేకరి ఆమెను ఉద్దేశించి ‘‘మీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా?’’ అని ప్రశ్నించగా.. ఈ అంశంపై మాట్లాడ దల్చుకోలేదన్నారు. మీరు దృష్టిని నా వైపు తిప్పితే.. రైతుల పోరాటం, కష్టాలు వృథా అవుతాయన్నారు. ఇక్కడ ఫోకస్ నాపై కాదు.. రైతులపై మాత్రమే ఉండాలన్నారు.