బిలియనీర్ల అడ్డా హైదరాబాద్!
NEWS Aug 31,2024 12:17 pm
టాప్-3 ఇండియన్ సిటీస్‌లో హైదరాబాద్ మూడో స్థానానికి చేరుకుంది. తాజాగా విడుదలైన ‘హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2024’ 386 మంది బిలియనేర్లతో ముంబై దేశంలోనే నం.1గా ఉంది. 217 మంది సంపన్నులతో న్యూదిల్లీ రెండో స్థానం. 3వ స్థానం హైదరాబాద్ దే. ఈ లిస్టు ప్రకారం వేల కోట్ల సంపద ఉన్నవారు హైదరాబాద్‌లో 104 మంది ఉన్నారు. ప్రముఖ ఫార్మా కంపెనీ దివీస్ లాబోరేటరీస్ వ్యవస్థాపకులు మురళి దివి, అతని కుటుంబ సభ్యులు సంపద ఈ ఏడాది 76,100 కోట్లకు చేరింది. దేశంలోని సంపన్నుల లిస్టులో మురళి 26వ స్థానంలో నిలిచారు. హైద్రాబాద్ లో ఆయన టాప్ లో ఉన్నారు.