డుంబ్రిగూడ మండలంలో భారీ వర్షం
NEWS Aug 31,2024 05:41 pm
డుంబ్రిగూడ మండల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. శనివారం ఉదయం నుండి అడపదడప వర్షం పడినా, సాయంత్రం నాలుగు గంటల నుండి వర్షం దంచి కొడుతుంది. దీంతో ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే వారు చాలా ఇబ్బందులు పడ్డారు. మరీ ముఖ్యంగా పశువులను, మేకలను మేతకు తీసుకువెళ్లిన రైతులు ఇబ్బందులు పడ్డుతూ వాటిని త్వరగా ఇళ్లకు తోలుకు వస్తున్నారు.