పెదబయలు మండలంలోని గంపరాయి గ్రామంలోని రామాలయ వీధిలో నూతన విద్యుత్ స్థంభం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఉన్న విద్యుత్ స్తంభం పూర్తిగా పాడైపోయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కూలిపోయే పరిస్థితిలో ఉందని తెలిపారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందని భయాందోళనకు గురవుతున్నామని స్థానికులు తెలిపారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి నూతన విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.