మిస్డ్ కాల్ ఇస్తే BJP మెంబర్షిప్
NEWS Aug 31,2024 11:34 am
బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ సక్సెస్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. బీజేపీ సభ్యత్వం కావాలంటే 8800002024 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలన్నారు. తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి 77 లక్షల ఓట్లు వచ్చినయ్ 77 లక్షల మందిని బీజేపీ సభ్యులుగా చేర్పించేందుకు ప్రయత్నం చెయ్యాలన్నారు. 2019కి ముందు నార్త్ బ్లాక్ బయట నుండే సెల్ఫీ తీసుకున్న చరిత్ర తనదని, నేడు అదే నార్త్ బ్లాక్ లో కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నానన్నారు. కష్టపడి కమిట్ మెంట్ తో పనిచేస్తే బీజేపీలో గుర్తింపు వస్తుందన్నారు.