వాయుగుండం - జిల్లాలకు రెడ్ అలర్ట్
NEWS Aug 31,2024 11:52 am
TG: వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు తెలిపారు. రానున్న 2 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలు, అత్యంత భారీ వానలు పడతాయని చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.