తూ.గో జిల్లాలో కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు
NEWS Aug 31,2024 11:22 am
అధిక వర్షాలతో ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలను అనుసరించి కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి వెల్లడించారు. కలెక్టర్ కార్యాలయం, కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయం,అన్ని మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేసి సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు.