భారీ వర్షాలు - నలుగురు మృతి
NEWS Aug 31,2024 11:11 am
AP: రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఎన్టీఆర్ జిల్లాలోని కృష్ణా నదీ పరివాహాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు.