జగన్ బాటలోనే బాబు: షర్మిల
NEWS Aug 31,2024 11:02 am
వైద్య, విద్యా సంస్థలకు ఎన్టీఆర్ పేరు తొలగించి మాజీ సీఎం జగన్ ఆనాడు పెద్ద తప్పు చేస్తే.. ప్రస్తుత సీఎం చంద్రబాబు కూడా అదే బాటలో నడుస్తున్నారు అంటూపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలలకు, ఆసుపత్రులకు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు తొలగించడాన్ని ప్రతీకార చర్యగా పేర్కొన్నారు. ఎన్‌టీఆర్, వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడిన వాళ్లేనని, పాలనలో తమదైన ముద్ర వేశారని షర్మిల గుర్తు చేశారు.