ఫించను ఒక రోజు ముందుగా ఇచ్చిన ఘనత చంద్రబాబుదే: మాజీమంత్రి
NEWS Aug 31,2024 11:38 am
హుకుంపేట: సంతారి పంచాయితీలో జరిగిన పింఛను పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టీడీపీ అరకు పార్లమెంటు అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. శ్రావణ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు సామాజిక పింఛన్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, 1వ తేదీ సెలవు రావడంతో సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదని ఒక రోజు ముందుగానే పింఛను పంపిణీ చేసి చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయారని శ్రావణ్ అన్నారు.