తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గండి చెరువు వద్ద శనివారం ఓ ఆర్టీసీ బస్ కు పెను ప్రమాదం తప్పింది. ఏలూరు డిపోకు చెందిన బస్సు ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్తున్న తరుణంలో బస్ ఫ్యాన్ బెల్టు ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో వెంటనే స్టీరింగ్ లాక్ అవ్వడం వల్ల బస్ రోడ్డు పై అక్కడికక్కడే నిలిచిపోయి ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.