కాకినాడ జిల్లా పిఠాపురం కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. మున్సిపల్ కమిషనర్ కనకారావు, డీఈ భవాని శంకర్ వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే ఇద్దరూ ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వీడియో వైరల్ అవుతుంది. ఫైల్స్ పై సంతకాల విషయంలో ఇరువురి మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఉన్నతాధికారుల ప్రవర్తన పై పలువురు సిబ్బంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు.