శ్రీసత్యసాయిజిల్లా: లేపాక్షి ఆలయ ఛైర్మన్ కరణం రమానందన్ జన్మదినం సందర్భంగా హిందూపురం పట్టణంలోని ముద్దిరెడ్డి పల్లిలో ఉన్న రూప శ్రీ వృద్ధాశ్రమంలో అయన సన్నిహితులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి అన్నదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎంతో మంది పేదలకు సేవచేసిన రమానందన్ పుట్టిన రోజు వేడుకలను వృద్ధాశ్రమంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.