బైక్ రేస్ చేస్తే కఠినమైన చర్యలు
NEWS Aug 31,2024 11:48 am
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో రోడ్లపై బైక్ రేస్ లను నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్న యువకులకు స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో డిఎస్పి మహేష్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇకపై బైక్ రేస్ లకు పాల్పడితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కార్యక్రమంలో టూ టౌన్ సీఐ అబ్దుల్ కరీం, సిబ్బంది పాల్గొన్నారు.