ఆశ్రమ పాఠశాల విద్యార్ధుల నీటి కష్టాలు
NEWS Aug 31,2024 05:43 pm
డుంబ్రిగుడ మండలంలోని సొవ్వ పంచాయితీ దేముడువలస ట్రైబల్ వెల్ఫేర్ బాలుర ఆశ్రమ పాఠశాల బోరు రిపేరు రావడంతో స్నానాలకు, త్రాగునీటికి విద్యార్ధులు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో దేముడువలస గ్రామంలో ఉన్న చేతి పంపు విద్యార్థుల స్నానాలకు, తాగునీటికి దిక్కుగా మారింది. గ్రామంలో ఒక చేతి పంపు మాత్రమే ఉండటంతో ఇటు విద్యార్ధులు అటు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు పేర్కొన్నారు.