విద్యార్ధినిలకు శ్రావణ్ భరోసా
NEWS Aug 31,2024 10:47 am
అరకు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జామగూడ ఆశ్రమ పాఠశాల విద్యార్ధినులను టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్, టీడీపీ నాయకులు పరామర్శించారు. శ్రావణ్ ఒక్కొ విద్యార్ధిని పరామర్శించి, దైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఘటన వివరాలను పాఠశాల ఉపాధ్యాయులను, విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. విషాహారంకు భాద్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.