బాసర హుండీ లెక్కింపులో విదేశీ కరెన్సీ
NEWS Aug 31,2024 09:39 am
నిర్మల్: బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో హుండి లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. అమ్మవారి హుండిలో సమర్పించిన కానుకల లెక్కింపును ఆలయ అధికారులు పకడ్భందీగా నిర్వహించారు. కేవలం 79 రోజుల్లోనే 99 లక్షల 17 వేల 200 ఆదాయం సమకూరినట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శరత్ పాఠక్, ఈఓ విజయరామారావు తెలిపారు. ఇందులో 116 గ్రాముల మిశ్రమ బంగారం, 4,700 గ్రాముల మిశ్రమ వెండి, 35 విదేశీ కరెన్సీ ఉన్నట్లు వారు తెలిపారు.