శ్రీసత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్రాజు అనంతపురంలో ఇంజనీరింగ్ విద్యార్థికి ల్యాప్ టాప్ అందించారు. గుడిబండ మండలం బైరేపల్లి దళితవాడకు చెందిన చైత్ర అనంతపురంలోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ 4సంవత్సరం చదువుతుంది. బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యేసూచించారు. ఈ సందర్భంగా చైత్ర ఆమె కుటుంబ సభ్యులు ఎమ్మెస్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.