ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ‘ఎయిర్‌బస్ బెలూగా’ నిన్న హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ‘వేల్ ఆఫ్ ద స్కై’ (ఆకాశ తిమింగలం) అని పిలిచే ఈ ఎయిర్‌బస్ ఎ300-608ఎస్‌టీ విమానం మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. థాయిలాండ్ వెళ్తూ ఇంధనం నింపుకునేందుకు ఇక్కడ ఆగింది. ఈ ఆకాశ తిమింగలం ప్రయాణం ఈ నెల 27న ఫ్రాన్స్‌లోని టౌలౌస్ విమానాశ్రయం నుంచి మొదలైంది.