ఇంటి వద్దనే సామాజిక పింఛన్లు పంపిణీ
NEWS Aug 31,2024 09:17 am
బూర్జ మండలం లక్కుపురంలో సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ ఆదేశాలు మేరకు ఉదయం 5గంటలకే గ్రామానికి చేరుకున్న సచివాలయం సిబ్బంది పెన్షన్దారుల ఇంటి వద్దనే ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల పింఛన్లు పంపిణీ చేసారు. కూటమి నాయకులు ఎన్ రామకృష్ణ, నరసింహమూర్తి, భాస్కరరావు, శ్రీనివాసరావు,జనార్థన్, సింహాచలం, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.