పెంబి మండలం చిన్నరాగిదిబ్బ సమీపంలోని వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసిన షెడ్డులో ఉన్న ఆవులపై శుక్రవారం రాత్రి ఓ చిరుత దాడి చేసి చంపేసింది. చిన్నరాగిదిబ్బ గ్రామానికి చెందిన ఓ పశువుల కాపరి తన పొలంలో షెడ్డును ఏర్పాటు చేసుకుని ఆవును పెంచుతున్నాడు. షెడ్డులో ఉన్న ఆవు కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించగా ఇంటికి సమీపంలోని పొలం గట్టుపై చిరుత దాడిలో ఆవు మృతి చెందినట్లు బాధితుడు తెలిపాడు.