కూతురు బారసాల ముగిసిన గంటలోనే గుండెపోటుతో తల్లి మృతి చెందింది. ఖానాపూర్ పట్టణానికి చెందిన మామిడాల రాజశేఖర్-శిరీష (28) దంపతులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ అక్కడే నివాసముంటున్నారు. వీరికి 21 రోజుల క్రితం కూతురు పుట్టింది. గురువారం బారసాల నిర్వహించారు. రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయే సమయంలో శిరీషకు ఛాతిలో నొప్పి వచ్చింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.