డుంబ్రిగూడ మండలంలోని జాముగూడ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ సందర్శించారు. విద్యార్థినిల తల్లిదండ్రులుతో కలెక్టర్ మాట్లాడారు. పాఠశాల వార్డెన్, ప్రధాన ఉపాధ్యాయురాలు పనితీరు బాలేదని, గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని వారు కలెక్టర్కు చెప్పినట్లు సమాచారం. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలో హెల్త్ వాలంటీర్లను నియమించాలని కోరారు.