సహాయక చర్యల్లో పోలిశెట్టి తేజ
NEWS Aug 31,2024 10:49 am
తుమ్మల పాలెం గ్రామ ప్రజలందరూ అప్రమత్తం గా ఉండాలని, బాధితులకు తాము అండగా ఉంటామని జనసేన మండల అధ్యక్షుడు పోలిశెట్టి తేజ భరోసా ఇచ్చారు. మండల వ్యాప్తంగా పరిస్థితిని పరిశీలిస్తున్న పోలిశెట్టి తేజ.. కృష్ణా నదిలోకి మత్యకారులు వేటకు వెళ్లకూడదని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని ధైర్యమిచ్చారు. జనసేన కార్యకర్తలు అందరూ సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు.