తంగళ్ళపల్లి PHC కలెక్టర్ తనిఖీ
NEWS Aug 31,2024 09:23 am
వర్షాకాలం నేపథ్యంలో దవాఖానల్లో రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ సేవలు, ఫార్మసీ, వ్యాక్సిన్ గది, ఆసుపత్రి ఆవరణను పరిశీలించారు. ఫిజియో థెరపీ సేవల రిజిస్టర్ తనిఖీ చేశారు.