అకాల వర్షాలతో వాగులు వంకలు, పొంగి ప్రవహిస్తున్నాయి.ముఖ్యంగా కొండపల్లి మున్సిపాలిటీలో డ్రైనేజీలు ఉధృతంగా మారాయి. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు తన పర్యటనను కొనసాగించారు. నడుం లోతు నీటిలో తిరిగి పర్యటించి వరద బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మైలవరం నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు.