ప్రజల రక్షణ కోసమే పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్
NEWS Aug 31,2024 11:13 am
కాగజ్ నగర్ పట్టణంలోని కాపువాడలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన అనుమతి పత్రాలు లేని 100 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గంజాయి మాదాకద్రవ్యాల నిర్ములనపై యువకులకు అవగాహన కల్పించారు.ప్రజల రక్షణ చర్యలలో భాగంగానే కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ డీఎస్పీ కరుణకార్, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.